Friday, May 18, 2012

భూమి మీద ఒక గ్రహాంతర ప్రదేశం

పురాణం :
                          సౌరకుటుoబం  ఏ ర్పడే సమయం లో, సూర్యుడు భూమిమీద  కొన్ని ప్రదేశాలని తన  నివాసం కోసం ఎంచుకుని విశ్వకర్మ  చేత  నిర్మింపచేసుకున్నాడు. అలా భూమిమీద  ఉండే ఒక గ్రహాంతర  ప్రదేశమే చెన్నై.ఇప్పటి చెన్న పట్నం లేదా చెన్నై పూర్వం మద్రాసుగా మండుతుండేది.

సాధారణంగా భూమిని కాపాడే చిత్రాలని నిర్మించే అమెరికన్లు తెరకెక్కించిన  చీకటిలో మనుషులు ( Men In Black) సినిమాకి సంబంధించిన  వాస్తవ  ఆధారాలు ఇక్కడనుంచే సేకరించడం జరిగింది. 

వాతావరణం :
                           భూగ్రహం లాగానే రాత్రి పగలు వుంటాయి. 
పగలు - సూర్యుడు సముద్ర  స్నానం చేసి వచ్చి ఇక్కడ  పట్టణ  వీదుల్లో తిరుగుతుంటాడు.
రాత్రి - అలా తిరిగి తిరిగి అలసిపోయిన  సూర్యుడు ఎవరికీ కనిపించకుండా ఇక్కడే ఎక్కడో దాక్కొని పడుకుని నిద్రపోతాడు.  అందుకే చీకటి పడుతుంది కాని వేడి తగ్గదు. 
(సూర్యుడు దాక్కోవటానికి కారణం వుంది - ఒకవేళ  కనిపిస్తే అలసిపోయాడని కూడా చూడకుండా గరిష్ట  శబ్దంలో తమిళ  మాస్ పాటలు పెట్టి నృత్యాలు చేసి నిద్ర  పోనివ్వరు)

         భూగ్రహం లాగానే 3 కాలాలు వుంటాయి. 
       భూమి                          చెన్నపట్నం
1. శీతాకాలం   =  ఎండాకాలం (వేడిగా వుంటుంది )
2. వర్షాకాలం  =  మండేకాలం (అప్పుడప్పుడు  అకాల  వర్షాలు పడి,నగర  వీధుల్లో  మురికినీరు ప్రవహిస్తుంది)
3.వేసవికాలం  =  మండుటెoడాకాలం ( వీధి పై తారు కరిగి సైడ్    కాలవలలో ప్రవహిస్తుంటుంది )

భాష  - ఆహరం :
                         ఇది భూమి కాదు కనుక  ఇక్కడ  ఇతర  భాషలు అరుదు. ఒక  వేళ  భూభాషలైన తెలుగు, హిందీ, ఆంగ్లం వంటివి మాట్లాడారా అంతే వీళ్ళు మిమ్మల్ని గ్రహాoత రవాసులుగా గుర్తిస్తారు(తర్వాత  మీ ఇష్టం).
                          మరి ఆహార విషయo అంటారా - సాంబారు ప్రధాన  ఆహరం - అన్నం, ఇడ్లీ, దోస , పిజ్జా  ఇలాంటివన్నీ సాంబారులో నంచుకుంటారు.
(మీరు చెన్నై లో వుండి వుంటే (కేవలం మీ కోసం మాత్రమే) తయారీ విధానం - చింతపండు + కూరగాయ ముక్కలు + పప్పు+ ఉప్పు +మిరప్పొడి  గిన్నె(బాణ )లో వేసి తగినన్ని నీళ్ళు పోసి  మూత  పెట్టి ఒక 10 నిముషాల  తర్వాత  చూస్తే వేడి వేడి పొగలు కక్కే సాంబారు రెడీ)


చివరిగా - నీటి కొరత, కరంటు కోత  ఇక్కడ  నిత్యం ప్రత్యేకం. ఇక్కడి వాళ్ళు కూడా భూగ్రహవాసులలాగే నడవటం, ఈదటం మొదలైనవి చేస్తారు వాటితో పాటు విచిత్రంగా కొన్ని చేస్తుంటారు (క్షమించాలి - అవి ఏమిటో నాకు తెలీదు ఇక్కడ  మీకు వివరించడానికి). నోరు తెరిచి అడిగితే ఈ  పుణ్య  మూర్తులు పోడా పావి అంటారు నవ్వుతూ.... 

6 comments:

  1. your blog is very nice...i am one of the your site followers

    ReplyDelete
  2. గత వారం రోజులుగా 'ఛ 'న్న పట్నంలో భారీ వర్షాలు పడుతున్నాయి. కాని ఒక్క నీటి చుక్క కూడా భూమిని తాకటం లేదు.

    ReplyDelete
  3. చెన్నై భూతాల స్వర్గం - బెంగళూరు భూతల స్వరం . నేను ఆంగ్లం లో "bhootala" అని ఒకే పదాన్ని టైప్ చేసాను పై రెండు దగ్గర్ల.

    ReplyDelete
  4. People who lived in Chennai would definitely agree with you, We can say ""Go to Chennai in Mid Summer"" rather than ""Go to Hell"". haha.

    ReplyDelete