Sunday, March 9, 2014

రూపాయి

టక్కు టమారాలు
            గజకర్ణ గొకర్ణాలు
టొపీల మోసాలు
            సంపెంగ మీసాలు
టపాసుల మోతలు
            అబ్బో సొంత డబ్బాలు
టిప్పు టాపుల వేషాలు
            టిక్కు టిక్కుమను రోలెక్సులు 
టూకీగా, టక్కులమారి రూపాయి రూపాలు 
            రుబాబులు విచిత్ర వికృత  వేషాలు  

కలకాలం

హృదయాన పొంగిన ఆవేదం ఆమోదమొదమై
కన్నుల జారిన నీరు పన్నీరై
కలం చిమ్మిన సిరా కవితామృతమై
కాలంలో నా గురుతులు శాశ్వతమై
నే ఒలికిన గుప్పెడు అక్షరాలు,
               కలకాలం నానుడియై  

రంగుల రాట్నం

పగటి వెలుగుల తెలుపు
వెలుగు చూపే సప్తవర్ణాల మెరుపు
ఆకాశాన్నలిమిన నీలాల, జీవాన్ని తెలిపే పచ్చల కలుపు
సంధ్యల దాగిన రుధిరపు ఎరుపు
కలిగించు నయనాల మురుపు
అన్ని రంగుల దోచేసి దాచెస్తూ రేతికి ముసిరిన నలుపు
తెలినలి రంగుల రయ్యిన తిరిగే రంగుల రాట్నం, లెక్కలు తెలిపే గడిచేకాలపు