Thursday, June 7, 2012

ధర్మవరపు నిజజోకులు

ఈమధ్య ఏదో టి.వి  షోలో ధర్మవరపు సుభ్రమణ్యం (డి.ఎస్) తన నిజజీవితంలో జరిగిన కొన్ని హాస్యసన్నివేశాలు  వివరించాడు.
నాకు గుర్తున్న రెండు...
                                               ఒకసారి డి.ఎస్  ట్రైన్లో ఒంగోలు నుంచి హైదరాబాద్ రాత్రి సమయంలో ప్రయాణం చేయాల్సి వచ్చిందట. ట్రైన్  ఎక్కే సమయానికే ట్రైన్లో లైట్స్ ఆపేసి అందరూ నిద్రపోతున్నారట. తన ఎదురు సీట్లో కూర్చున్న వ్యక్తి మాత్రం నిద్రపోకుండా ఈయన వచ్చి కూర్చోగానే, సర్ నాకు నిద్రపడితే తెల్లవారితే తప్ప మధ్యలో మెలకువరాదు. నేను చాల అవసరమైన కోర్టుపనీమీద గుంటూరు వెళ్తున్నాను, సరైన సమయంకి వెళ్ళకపోతే చాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సివుంటుంది. నన్ను మీరు నిద్రలేపుతాను అని భరోసా ఇస్తే పడుకుంటాను అని అభ్యర్దిన చేసుకుంటే దానిదేముందండి నేను మెలకువగానే వుంటాను తప్పక లేపుతాను మీరు నిశ్చింతగా పడుకోండిఅని అభయహస్తం ఇచ్చి మన డి.ఎస్ గారు కూడా పడుకున్నారట. సికింద్రాబాద్ స్టేషన్ రాగానే తన ఎదురు ఫై బెర్తులో వ్యకి దిగి నన్ను ముంచేశావు కదయ్య అని తిట్టటం మొదలెట్టాడట. మన  డి.ఎస్ గారు ఆశ్యర్యంగా చూస్తుంటే తిడుతున్నా మొద్దులా అల చూస్తావే అని ఉక్రోషంగా అనేసరికి,  నువ్వే ఇలా తిడుతుంటే గుంటూరులో ఈ  సీట్లో నిద్రపోతుంటే  నేను బలవంతంగా ట్రైన్ దించేసిన వ్యక్తి ఎలా తిట్టుకున్తుంటూఉంటాడో అన్నారట :)

                                              మన  డి.ఎస్ గారి ఏరియా పోష్టుమాన్ అయ్యా మీ చిన్న కొడుకుని బయటకి పంపకండి అని బ్రతిమిలాడుకున్నాడట.  ఏమైందండీ అంటే, మీ వాడు (వీధి చివర  ఉండే) పోస్టాఫీస్  కి నాలుగు రోజులకి ఒకసారి వచ్చి ఒక ఎన్వోలోప్ ఎంత ? కార్డు ఎంత? 4 కార్డులు, 3 ఎన్వోలోప్ లు ఎంత? ఒక వేళ కార్డు విలువ ఇంత, ఎన్వోలోప్ విలువ ఇంత ఐతే ఎంత అవుతాయి, ఇన్ని కొని కొన్ని తిరిగిచ్చేస్తే ఎంత డబ్బులు వాపసు వస్తాయి  అని విసిగిస్తున్నాడు అని వాపోయాడట. విషయం ఏమిటంటే తరగతిలో మనవాడికి హోమేవోర్క్ ఇస్తే అది పోష్టుమాన్ చేత చేయిస్తున్నాడు జూ. డి. స్.

Tuesday, June 5, 2012

నా బాల్యం - వీరంగం '2'

నా బాల్యఖర్మలు తరువాయి భాగం :
                                  
                                    6.  మొన్న మా అమ్మగారిని నా చిన్నప్పటి చేష్టలు ఏమైనా చెప్పమంటే క్రింది విషయం చెప్పారు. నాకు చిన్నప్పటి నుంచి పౌరుషం(కొన్ని భాషల్లో తిక్క అని కూడా అంటారు) ఎక్కువ. సరిగా గుర్తులేదు షుమారుగా మూడో తరగతి చదివేటప్పుడు మా పాఠశాల రెండు వీధుల అవతల వుండేది. ఒక రోజు స్నానం చేసి టవల్ చుట్టుకు వచ్చి ఏ బట్టలు వెసుకోమంటావు అని అడిగితే (ఆ రోజు యునిఫార్మ్ వెసుకోవాలి ;)) ఎదో పని చేసుకుంటున్న మా మాతృమూర్తి అలగే వెళ్ళరా అని అన్నరట. చెప్పాగా నాకు పౌరుషం ఎక్కువ అని మారు మాట్లాడకుండా  "పాఠశాలకి అలాగే వెల్లిపోయా". టవల్ యునిఫార్మ్ కాదు కనుక నన్ను తిరిగి ఇంటికి పంపేసారు.
                                    7.  నేను చిన్నప్పటి నుంచి ఆగష్ట్ 15, జనవరి 26 అంటే  దేశభక్తితో  ఉపన్యాసాలు తప్పక ఇచ్చేవాడిని.   అలా ఒక జనవరి 26వ తేదీన దేశభక్తుల గురించి ఉపన్యాసం తయారు చేసుకువేళ్ళా.            చంద్రశేఖర ఆజాద్ చిన్నతనంలో తెల్లవాళ్ళు వందేమాతరం అనే భారతీయులని కొడుతుంటే తిరగబడి రాయివిసిరి   తెల్లవాడి తలపగలకొడతాడు. చెప్పాల్సిన విషయం ఇది. నేను ఉపన్యాసం మధ్యలో "రాయితీసుకుని.. "తర్వాత    స్క్రిప్ట్  మరిచిపోయా. రాయితీసుకుని పుచ్చలు పగలకొట్టాడు అని ఉపన్యసించా. ఇంకేముంది ఒక నెల రోజులు ఎవరు ఎక్కడ  కనపడ్డా " పుచ్చలు పగిలాయా  ఇంతకీ .." అని అడిగేవారు పక పక  పళ్ళు బయటపెట్టి నవ్వుతూ .
                                    8. నాకు ఎదైనా సందేహం వస్తే వెంటనే లేచి ప్రశ్నఅడిగే వాడిని. ఆరో తరగతిలో ఉన్నప్పుడు మాకు ఆంగ్లం నేర్పించటానికి కొత్త మేడం వచ్చింది. అర్ధాలు చెపుతూ
                                                                      marriage = పెళ్లి అని చెప్పింది.
నా పక్కన గోపాల్ అనే ఆదిమ మానవ వెధవ, మరి శోభనంని ఏమంటారు అని నన్నడిగాడు. నాకూ  తెలీదు, వాడి సందేహం నా సందేహమయ్యింది. ఠక్కున లేచి మేడం మరి శోభనంని ఏమంటారు అని అడిగా. ఆమె సమాధానం చెప్పకుండా  నాకు పెళ్లి చేసింది. ఆ రోజునుంచి వాడు నేను శత్రువులం ..
                                    9. మేము చిన్నప్పుడు ఇంకుపెన్లు బాగా క్రేజ్.  నా తరగతిలో సుధాకర్ అని ఉండేవాడు. వీడు పచ్చి తాగుబోతు. వీడికి ఇంకుపెన్ ఎవరూ ఇచ్చేవాళ్ళు కాదు. వెధవ ఇంకు తాగేసి పెన్ లో కుళాయిలో నీళ్ళు పట్టి ఇచ్చేవాడు.
                                    10.  ఏడో తరగతి లో ఉన్నప్పుడు మధ్యాహ్నం భోజనం క్యారేజి తీసుకువెళ్ళేవాడిని.
6, 7 తరగతి గదులు వరసగా ఉండేవి. 6 వ తరగతి  వాళ్ళు కూడా బాక్స్ లు తెచుకుని మా తరగతిగదిని గందరగోళం చేసేవాళ్ళు. హరిణి అని 6వ  తరగతి పిల్ల నా బెంచ్ లో కూర్చొని పాడుచేస్తుంటే (తింటుంటే)             'ఇడ్లీ తిని డేడ్లీ' గా బెదిరించా ఇక్కడినుంచి లెమ్మని.  లేవక పోగా తిరిగి నన్ను బెదిరించింది. నేను ఇదివరకే చెప్పాగా నాకు పౌరుషం ఎక్కువని, నా క్యారీజి తీసుకుని ఆ పిల్లని తరుముకుంటూ వెళ్ళా, పక్కనే వున్న బాత్రూంలో వెళ్లి దాక్కుంది మన దెబ్బకి జడిచి. ఆ మాత్రం భయం వుండాలి అనుకుంటూ బయట గడియ పెట్టి నాపాటికి నేను వచ్చేసా.
              లంచ్ తర్వాత, రెండో  పీరియడ్ లోసోషల్  పరీక్ష వుంది దానికి మొదటి పీరియడ్ లోరహస్యంగా చదువుతూ పేజీలు  తిప్పుతుంటే, ఆయ వచ్చి 7వ తరగతి సురేష్ ని ప్రధానోపాధ్యయులు పిలిస్తున్నారు అని చెప్పింది. ఈయనకి నన్ను చూడందే రోజు గడవదు అనుకుంటూ లేచి కాలర్, కళ్ళు ఎగరేసి అందరినీ ఒకసారి చూసి బయలుదేరా. ఇంతకీ ఏమయ్యివుంటుంది విషయం అనుకుంటూ అక్కడకి వెళ్లేసరికి పిల్ల పిశాచి హరిణి కనిపించింది. నాకు విషయం అర్థంఅయ్యింది. సరిగ్గా అ లాంటి సమయాల్లో నాకు దేవుడు గుర్తుకొస్తాడు. దేవుడా ఈ గండం గట్టేక్కిస్తే నీకు రెండు కమ్మరికట్టలు కొనిపెడతా అని దణ్ణంపెట్టుకున్నా. మీ తల్లితండ్రులని తీసుకునిరా వెళ్ళి అన్నాడు. ఇదొకటా ఇక్కడే ఐతే ఏదో 4 దెబ్బలతో సరిపోతుంది ఇంట్లో కూడా తెలిస్తే వామ్మో, నేనేమి మాట్లాడలేదు.
చేతులు చాచమని రూళ్ళ కర్ర తీసుకొని 4 పీకి,  మోకాళ్లమీద కూర్చోమని చెప్పాడు. ఏడుపుమొహం పెట్టి అలాగే చేశా లేదంటే మళ్ళా రూళ్ళకర్రచేసుకుంటాడు. తర్వాత తెలిసింది ఆ పిల్ల చాలాసేపు అలా బాత్రూంలో తలుపు కొడుతూ ఉండిపోతే ఆయా వెళ్లి తీసిందంట. నా మీద ఫిర్యాదు ఇమ్మని చెప్పింది కూడా ఆయానే అంట.. ఈ ఆయాలకి నాకు ఎప్పుడు పడిచావదు.. 




Saturday, June 2, 2012

`గజఈతగాడు`

                    ఒకానొక  వేసవికాలం సెలవల్లో, నేను ఫ్రసాద్ మధ్యాహ్నభోజనాలు అవి చేసి పని
 పాట  లేకుండా వీధుల్లో పడి పిల్లుల్ని వెతుకుతున్న సమయంలో ఉల్లిపాయగాడు పిల్లులున్న సంచి భుజాన వెసుకుని దువ్వెన, కత్తెర్లతో ప్రత్యక్షం అయ్యాడు. మమ్మల్ని కలిసిన ఆనందంలో ఉల్లిపాయగాడు  పిల్లుల్ని వదిలేసి, ఎక్కడైనా  చల్లటి ప్రదేశం వెదుకుతాం అన్నాడు మొహం మీద చెమట తుడుచుకుంటూ.

 ఊటీ, సింలా ఇప్పటికి ఇప్పుడు వెళ్ళటం కష్టం కాబట్టి మా ఇంటిదగ్గరగా వుండే ఈతకొలనుకి వెళ్దాం అని ఉల్లిపాయ అనేసరికి, సాధారణంగా ఎవరు ఏది చెప్పినా అట్టాగే, కరెక్ట్ మామ  అని తలూపే ఫ్రసాద్  అట్టాగే అట్టాగే అంటూ గుండ్రంగుండ్రంగా తలూపేస్తున్నడు. ఈత కొలనుకు వెళ్తే చల్లదనం తో పాటు,
ఈత  కొట్టేయోచ్చు(నేర్చుకొని ).  అసలే అప్పుడెప్పుడో ఒకసారి నగరంలోని వుద్యానవనంకి వెళ్తే,
అక్కడ చిలకడు చిలకజ్యోతిష్యం చెప్తా అని నన్ను పిలిచి 5రూ/- తీసుకొని నాకు
                                                          జలగండం, వివాహయోగం  వుందని చెప్పాడు.
 అదీకాక  భవిష్యత్తులో 

                     సురేష్..  
                        - M.B.B.S, M.D, M.Tech, MBA(CAT*), etc.., + Elephant-swimmer 
    అని బోర్డు పెట్టుకోవచ్చు. 

ఉల్లిపాయ  1947 మోడల్  యమః బాక్సర్  బండి మీద  ముగ్గురం ఎక్కి రెండిళ్ళ అవతల  వున్న
O3 [Ozone]  అనే పేరుగల  ఈతకొలనుకి వెళ్ళాం. Valetparking లేదు కాబట్టి ఉల్లిపాయ
బండి పార్కింగ్ చేసే లోపు నేను, ఫ్రసాదు లోపాలకి వెళ్ళాం.
                          Swimming 1 hour only 50/- per head
అని బోర్డు పెట్టి వుంది. నేను, ఫ్రసాదు వున్న చిల్లర  అంతా లేక్కేసే ఒక 100రూ/-కట్టి లోనికి వెళ్ళాం.
 చాలా సేపు అయినా ఉల్లిపాయలోనికి రాకపోవటంతో,  బయటకి వెళ్లి చూసా.
వాడు రిసెప్షన్ దగ్గర గొడవపడుతూ నాకు అందరూ తలకాయలేదు అంటారు                           నేను డబ్బులు కట్టను అని లోపలి తోసుకు వస్తున్నాడు.
వీడికి తలకాయవుంది అని వాళ్ళు నిరూపించటానికి శతవిధాల ప్రయతం చేస్తున్నారు.
నేను జోక్యం చేసుకొని  నీ సంగతి వాళ్ళకెలా తెలుస్తుందిరా (ఆ పాటికే తెలిసిపోయింది) ఈ  సారికి డబ్బులు కట్టేయ్యి అని ఒప్పించి లోనికి లాక్కొచ్చా.
                                   నేను ఉల్లిపాయలోనికి వెళ్ళేసరికి ఫ్రసాద్  విభూతి పూసుకుని (ఎవరిదో రక్త)తిలికం దిద్ది,  ముగ్గేసి పసుపు కుంకుమచల్లి నిమ్మకాయలు అవి కోసి "శుక్లాం భరధరం..",
"సరస్వతి నమస్తుభ్యం ..", ఇంకా ఏవో వరుణదేవుని మంత్రాలు చదువు చూ (అరుస్తూ) వున్నాడు.
ఉల్లిపాయ వాడిని చూసి తనను బలిస్తారేమో అని భయపడి పారిపోబోయాడు, బలికి తలకాయ ఉండాలి కదరా..  అని గుర్తుచేస్తే ఆగాడు.

ఎవరైనా ఈత నెర్చుకోవాలనుకుంటే  :
1. ఈత  చెట్టుకింద ధ్యానం చేయాలి 
2. ఈత  పళ్ళు  తినాలి 
3. ఈత  కల్లు తాగాలి 
4. ఈత  బట్టలు వేసుకొన్న అమ్మాయిల్ని చూడాలి 
5. ఈత బలూన్ నడుముకి చుట్టుకుని నీళ్ళలో దిగాలి 
6. చల్ల చల్లని నీళ్ళలో ఈత కొట్టాలి 

అసలే గంటకి 50రూ/- కట్టా ఈసారికి ఈత కొట్టేద్దాం మిగతావి తర్వాత చూడొచ్చుఅనుకుంటుండగా,  ఈత నేర్పే ఈతగాడు వచ్చి చిన్న చిన్న చెడ్డీలు ఇచ్చి ఉచితం అన్నాడు, ఈత ఎలా కొట్టాలో చెబుతూ. ఉల్లిపాయగాడు ఉచిత చెడ్డీలు చూసి కొంచెం శాంతించాడు. మేము ఆనందముగా చొక్కాలు అవి తీసేసి చెడ్డీలు అవి వేసుకొని జనాలు తక్కువగా వుండే వైపు నీళ్ళలోకి దూకాము.  ఈత కొలనులో కాలుభాగం నీళ్ళు, అప్పటి వరకు ఈత కొట్టే అభాగ్యులు ఎగిరి ఒడ్డున పడ్డారు. ఉల్లిపాయ, ఫ్రసాదు ఇద్దరూ జలచరాలుగా మారిపోయి ఆచ్యర్యంగా ఇద్దరూ ఈత కొట్టేస్తున్నరు.  ఉల్లిపాయ నన్ను చూసి కళ్ళెగరేస్తూ, వాడు నిన్న ఈత వచ్చిన చేప, రొయ్యా పులుసువండించుకొని తిన్నడంట అండుకని ఇలా ఈత కొట్టిస్తున్నా అని పీత కథ చెప్పాడు. ఫ్రసాదు ఈత కొడుతుంటే అక్కడ చుట్టూప్రక్కల వాళ్ళందరూ భయపడి పారిపోతున్నారు.  ఆశ్చ్యర్యం తోపాటు వాడి ఈతని చూస్తుంటె భయంవేస్తుంది.   అలా ఒక 2 రౌండ్లు ఈతకొలనులో భీభత్సం సౄస్టించి ఒక మూల భయంతో నీళ్ళలో నించున్న నాదగ్గర తేలాడు.
నాకు వామనుడు, బలిచక్రవర్తి కథ విన్నప్పుడల్లా పాదాలతో భూమి ఆకాశం కొలవటం ఎమిటా అని సందేహం వుండేది వీడి పాదాలు చూసేంతవరకు.  వీడికి చెప్పులు బూట్లు కుట్టించెందుకు వీళ్ళ ఆస్తులన్నీ అమ్ముకోవలసివచింది. అలాంటి చిట్టి చిట్టి పాదాలతో ఈత కొడుతుంటే ఒక సునామి, జలప్రళయం సంభవించటంలో వింత ఏముంటుంది?  అయినా వీడికి ఈత ఎలా వచ్చింది అనేది ప్రశ్న?
వీడు చాలా చిన్నప్పుడు అంటే భూమి పుట్టిన కొత్తల్లో పల్లెటూర్లో ఉండేవాళ్ళంట అక్కడ బావులు, చెరువులు, పంట కాలువలు ఉండేవంట. వీడు పెరుగన్నంలో పోపు పెట్టించుకొని తిని గట్టుమీద కూర్ఛోని తూగుతూ చూస్తుంటే, అక్కడ ఆకతాయిలు వీడిని నీళ్ళల్లో తోసేస్తే  మునగదుంగలు అవి పట్టుకుని గజిబిజిగా గందరగోళంగా నీళ్ళని కొడుతుంటే నీళ్ళమీద తేలాడంట. అదే ఈత అని తెలియటంతో గజిబిజి గందరగోళం పెంచేసి నీళ్ళని కొట్టాడంట అంతే ఆ ఈత కొట్టుడికి ఊరిజనులు గజగజ వణకటంతో వీడికి గజఈత వచ్చేసింది. అప్పటినుండి వీడు ఎప్పుడు నీళ్ళలో పడినా ఇలా పిచ్చిపిచ్చిగా కొట్టేస్తుంటాదు(నీటిని) ఈత.
వీడు తిరిగి ఈత ప్రారంభించగానే చుట్టుపక్కల అందరూ ఈతకొలనులో ఏమి జరుగుతుందో అని అక్కడ గుమికూడారు. కొంచెం సేపటికి గుంపులోంచి ఒకాయన  వచ్చి "ఇరగతీస్తున్నరు మాస్టారు" అన్నాడు ఏడుస్తూ.
ఆ మహనుభావుడి ప్రశంసతో ఫ్రసాదు విశ్వరూపం దాల్చి తిమింగలంలా నీళ్ళని దబదబ బాదేస్తున్నడు, అక్కడవున్న ఈత కొలను యాజమాన్యం గజగజ వణికి గంటకొట్టేసారు. నీళ్ళల్లో దూకి  మా చెడ్డీలు లాగటం మొదలుపెట్టారు. చుట్టుప్రక్కల  జనులు ప్రాణభయంతో మేము మాన భయంతో పరుగులు తీసాము. గంటకి 50/- అంటే 60నిముషాలు అనుకున్నాంకాని ఇలా గంట కొట్టి చెడ్డీలు లాగేస్తారు అనుకోలేదు. పైగా చెడ్డీలు ఈత కొట్టినంత సెపేనంట ఉచితం.                                  
నాకు అప్పుడు  అర్థం అయ్యింది నా వరకు నాకు కాళ్ళమీద నిలబడటం ఇష్టం ఈత కొట్టటం కష్టం కాదంటే  50రూ/- నష్టం.

 మీ కోసం : మీరు ఎవరైనా ఎపుడైనా ఈత నేర్చుకోవాలి అనుకుంటే మీ ఈత చెడ్డీలు మీరు తీసుకువెళ్ళండి.