Monday, December 2, 2013

బలహీనత

ప్రతి ఒక్కరికి ఓ బలహీనత ,
                                         నాకు నువ్వు. 

నిరంతరం


ఒకటినొకటి తరిమే
          రేయిపగలు , సముద్రం లో ఆటుపోటులు
నా లో నీ ఆలోచనలు
నిరంతరం .. 

Thursday, March 28, 2013

నుదుటి గీతలు


బరువెక్కిన రెప్పలు, భారంగా కదిలే పాదాలు
కదలని గమ్యాలు, కరగని దూరాలు
మార్చలేని గతాలు, మలచలేని భవితలు
ఈరోజో రేపో అన్నట్టు జీవితాలు
మెరుపులు చూపే దారి మలుపులు
మనసులో ఎదో ఒకమూల చిరు వెలుతురులు
ఇవీ కొన్ని తల రాతలు ...

Friday, January 4, 2013

ఏమో


కళ్ళ నిండా కలలు, గుండె నిండా ఆశలు
కాలంతో పరుగులు, అలసటలు అలకలు
బుజ్జగింపులు, పలకరింతలు
చెదిరిన కలలు, తీరని ఆశలు
అయినా ఆగని పరుగులు, అలసినా తప్పని పయనాలు

ఆకాశంలో వెండి మబ్బులు
ఎదో ఓ మూల కారు మబ్బు
పులకరించేనా?
చిరు జల్లులు పలకరించేనా?
బీడులో పచ్చ గరిక చిగురించేనా?
గడ్డి పూలు వికసించేనా?