Wednesday, May 9, 2012

నేను - ఉల్లిపాయ - వ్యాయామం

అవి నా జూ . కళాశాల  ముగిసిన  రోజులు,

శారీరక  సౌష్టవం పెంచే విషయం తీక్షణంగా ఆలోచించి ఒక  నిర్ణయం తీసుకున్నా .. వ్యాయామశాల  చేరాలని 
ఈ  విషయమై నా మిత్రుడు Shake.ఉల్లిపాయ (వీడి పేరు ఫయాజ్  - హిందీలో ప్యాజ్  అంటే ఉల్లిపాయ) ఉత్సాహంగా వుండటంతో మా వ్యాయామం మొదలు ... సింహపురి నగరం లో బాగా పేరుమోసిన  వ్యాయామశాల  వెతికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాము .. మూడు నెలలకి ఒకేసారి చెల్లిస్తే తగ్గింపు ధర ... ఉదయం ఒక గంట  సాయంత్రం
ఒక  గంట. 

మంచి ఆర్నాల్డ్ ఫోటో ఒకటి సంపాదించి  ఆ  తల  పీకి నా  తల  అతికించి   మా నాన్నకి చూపించి (భయపెట్టి) డబ్బులు అడిగా.  ఇంట్లో వాళ్ళకి నమ్మకం లేదు ఈ  బద్దకస్తుడు వ్యాయామం అనుకోని కూడా చివరకి ఇచ్చారు .

మా వ్యాయామోధ్యపకుడు మొదటిరోజు వ్యాయామం ఎలా చెయ్యాలి - ముందు ఏమి చెయ్యాలి - తర్వాత  ఏమి చెయ్యాలి - వ్యాయామం చేసేటప్పుడు ఏమి చెయ్యాలి ( ఏమి చెయ్యకూడదు ) వివరించాడు .. వాడి బొంద  (నాకు ఒకళ్ళు చెప్తే వినే అలవాటు తక్కువ  - విన్నట్టు నటిస్తా :P)

వ్యాయామం చేసే ముందు ప్రతి ఒక్కళ్ళు వేడి కావాలి (warm-up) అంటారు దీన్నే .. మీ ఇష్టం ఎలా అయినా పర్లేదు ..  వ్యాయామం అయ్యేవరకు నీళ్ళు  తాగ  కూడదు (శరీరం చల్ల బడ కూడదు వ్యాయామం అయ్యేవరకు).
 ఆ  ట్రైనర్ గాడు మాత్రం పరిగెత్తమని చెప్పాడు డాబా మీద .. 
నేను కాసేపు ఎండలో నిలబడటం సులభమని నిర్ణయించుకున్నా .. (నాకు దేనికైనా సులభ పద్దతి పాటించటం ఇష్టం)
ఇక వ్యాయామానికి వస్తే .. మొదటి వారం 
ఉదయం - 
1. thread mill (నుంచున్న  చోటే పరిగెట్టటం - దొర్లే చువ్వల  మీద ) 
2. pull-ups (గోడకి తగిలించి వున్న ఇనుప  చువ్వ పట్టుకొని పైకి పాకటం )
3.push-ups(గోడకి తగిలించి వున్న ఇనుప  చువ్వ పట్టుకొని వేల్లాడటం ) 
4.dumbles lifting (తేలిక  పాటి బరువు ఒక్కో చేత్తో మొయ్యటం) వరసగా చెయ్యాలి ఒక్కొక్కటి 10 నిముషాలు 

కొంచెం ఈ  వ్యాయామం అలవాటు  అయ్యేవరకు సాయంత్రం వెళ్ళకూడదు అనుకున్నా. 

ఒకటో రోజు - 
         వేడి అయ్యాక  పైన  చెప్పిన  అన్ని పనులు ఒక్కొక్కటి 10-15 కాకుండా అన్ని పది నిముషాలలో పూర్తి చేసేసా.. (మరీ ఒకే పని 10 నిముషాలు చిరాకు నాకు).  మిగిలిన  సమయంలో   అక్కడ  వుండే మిగత  వ్యాయామ  సాధనాలని ఉపయోగించి  ఎలా వ్యాయామం చెయ్యాలో నేర్చుకుని (నాకు నేనే సెభాష్.. అనుకుని మనసులో)  మొదటి రోజు వ్యాయామం ముగించా..
పాపం మా ఉల్లిపాయగాడు మాత్రం ఆ  వ్యాయామశాలి  చెప్పిన  విధంగా చేసాడు (వెధవకి సొంత  తెలివి తేటలు తక్కువ  - లేవు అంటే ఒప్పుకోడు)

రెండో రోజు - 
        మళ్ళా వేడి అయ్యే కార్యక్రమం అయ్యాక  (ఎండలో కూర్చొని ) వ్యయమశాల  లో వుండే అన్ని పరికరాలు 
ఉ పయోగించి అన్ని రకాల  వ్యాయామాలు ఒక ఇరవై నిముషాలలో పూర్తి చేసి నీళ్ళు తాగి చల్లబడి విశ్రాంతి తీసుకున్నా ...
ఈ   ఉల్లిపాయగాడు మాత్రం  నిన్నలాగే చేసాడు. వెధవ  వీడు మారడు .

మూడవ  రోజు -
       నాకు  ఒక  మహత్తరమైన  ఆలోచన  వచ్చింది. మనం బరువులు ఎత్తటంలో నిపుణులం ఐతే మంచి భవిష్యత్తు వుంటుంది అని.. ఇంకేముంది ... 
మా ఉల్లిపాయగాడిని  ఉత్తేజ  పరిచా .. ఒక  ఇనుప  చువ్వకి రెండు వైపులా బరువు తగిలించి వెల్లికలా పడుకొని కిందకి పైకి మొయ్యాలి (ఇలా చేస్తే ఊపిరితిత్తులకి మంచిది.., INDIA కి మెడల్స్  కూడా తీసుకు రావ చ్చు).
మొదటి సారి వేసిన  బరువులు అవలీలగా ఎత్తేశా .. 
ఉల్లిపాయగాడు నాకు పోటీగా బరువులు పెంచి మరీ ఎత్తేశాడు .. 
మరదే .. నాకు మండేది .. నేను కూడా వాడిని పక్కకి నెట్టి బరువు బాగా పెంచేశా ..
ఉన్నట్టుంది భూమికి ఆకర్షణ  పెరిగి నేను ఎత్తే బరువుకు తన  వైపు బలంగా లాగటం మొదలు పెట్టింది.
(సురేష్  నియమం -  భూమికి ఆకర్షణ  స్థిరంగా వుండదు .. ఒక్కోసారి ఒక్కో ప్రదేశంలో విపరీతంగా పెరిగిపోతుంది,
అందుకే  ఒక్కోసారి రైల్వే స్టేషన్ లో బస్టాండ్లలో  బరువు చూసుకుంటే చాలా ఎక్కువగా వుంటుంది)

మా ఉల్లిపాయగాడు నా పరిస్థితి అర్థం చేసుకొని భూమి ఆకర్షణని ఎదిరించి బరువు నీ పీకమీద పడకుండా ఆపాడు.
వీడు జీవితం లో చేసిన  రెండో మంచి పని ఇది (మొదటిది నాతో స్నేహం చెయ్యటం). 

నాలుగో రోజు - 
       వ్యాయామశాల  అంటే జ్వరం వచ్చింది. ఐన  మూడు రోజులకే మూడు నెలలలో చెయ్యల్సినవన్ని చేసేస్తే ఇంకా  ఏమి చేస్తాం. దేనికైనా న్యాయం వుండాలి వేరే వాళ్లకి అవకాశ o  ఇవ్వాలి. అందుకే ఇంటి దగ్గరే వేడి అయ్యి దుప్పటి కప్పుకొని (ఇదొక పద్దతి) నిద్రలో మిగతావి పూర్తి చేశా. 


ఉల్లిపాయగాడు మాత్రం రోజూ ఉదయం సాయంత్రం వ్యాయామం చేసి కండలు పెంచటం ఏమో కాని కొవ్వు కరిగించాడు..

తర్వాత  ఇప్పటివరకు నేను వ్యాయామశాల  వైపు కన్నెత్తి చూడలేదు... అలా నా వ్యాయామం మూడు నాళ్ళ  ముచ్చటగా ముగిసింది.


2 comments:

  1. Chaala bagundi suresh,morning started with your blog
    We need publicity let me post it in Facebook ....

    ReplyDelete
  2. he he he :)..... chala bhavundhi

    ReplyDelete