Monday, May 7, 2012

పిచ్చి మామ

అనగనగా ఒక  వూరు( పేరు భీమవరం), 
అక్కడ  ఒక  ఇంజనీరింగ్  కళాశాల ,
అవి నేను ఇంజనీరింగ్  చదివే  రోజులు, హ్యాపీ డేస్  హ్యాపీ  హ్యాపీ గా గడిచి పోయేవి .. 
నేను ఎప్పుడు నా  సీనియ ర్స్  తో తిరిగే వాడిని (క్లాసులు ఎగ్గోట్టి ).. 
నా బాఛ్  లో ఎప్పుడు ముగ్గురుం వుండే వాళ్ళం  నాయకుడు  బుజిలి , ప్రతి నాయకుడు  పిచ్చి మామ   .. ప్రేక్షకుడు నేను.
మా జీవితం అప్పట్లో అలా అలా సాగేది
while(నిజం ) {
  while (నిజం ) {
       1. తినటం  
       2. నిద్ర  పోవటం 
       3. నగరం లో ఎక్కడ  మంచి చౌక  తినుబండారాలు దొరకుతాయో వెతకటం 
       4.  శ్రవణ  దృశ్యాలు  ( సినిమాలు) చూడటం
        కళాశాల  కి వెళ్ళ టం 
   if (పరీక్ష) break;
  }
5. చదవటం  (నిజం చదివే వాళ్ళం ... )
}
ఒక  రోజు Mr.బుజిలి అల్పాహారం (10 మైసూరు బొండాలు - 1 ఉప్మా పెసర - 1 దిబ్బరొట్టె .. etc., ) చేసి మా గదిలో
 (3 గదుల  ఇల్లు ) తలుపులు వేసుకొని నిద్రకు ఉపక్రమించాడు. నేను ఆ  సమయం లో నగరం లో లేను (అంతర్జాతీయ   సమస్యలు గురించి  చర్చించటానికి సింహపురికి బుష్ ని కలవటానికి వెళ్ళా). 
సరిగ్గా అదే సమయం లో మామ ! మామ ! పిచ్చి మామ  !! వచ్చాడు ..   బెల్  కొట్టాడు , తలుపు  బాదాడు 
సమాధానం లేదు. మన  బుజిలి  (కుంభకర్ణుడి అంశ - ఏదై నా తినేది వాసన  చూపిస్తే లేస్తాడు otherwise nobody wake him up)  అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న సమయం కాబట్టి ఇవేమీ చెవి  సోకలేదు నిద్రా భంగం చెయ్యలేదు.
మామకి అనుమానం వచ్చింది,  తాళం వెయ్య లేదు , బయట  బుజిలి చెప్పులు వున్నాయి ..
 వీడు  నా  బోoడాలు బాగాలేవని ఏదై నా అఘాయిత్యం చేసుకున్నాడా .. వెంటనే చుట్టూ పక్కల  వాళ్ళందరిని  నిద్రలేపాడు .. వాళ్ళు దొడ్డి తలుపు పగల  కొట్టి  లోపలి వెళ్లి బుజిలి ని చూసారు మన  వాడు స్పృహలో లేడు ..
తలా ఒక  తన్ను ఒక  నాలుగు బిందెల  నీళ్ళు నెత్తిన  పోస్తే (ఇక  లేవక  పొతే ఆ స్పత్రికి  తరలించాలనే ) ఆ  సమయంలో లేచాడు నిద్ర .. 
కళాశాల  మొత్తం పిచ్చి మామని  ఒక  నాయకుడులా చూసారు బుజిలిని కాపాడినందుకు ..
మన  వాడు మాత్రం గుక్కపెట్టి ఏడ్చాడు నిద్ర  చేడిపోయినందుకు 
                                                                             జై పిచ్చి మామ  జై జై పిచ్చి మామ.. 

   

3 comments:

  1. Super ra suresh....
    Nee story kooda add chey. poddunne exam appudu 5 i lechi 10 km velli 1 rupee dosalu tindam... etc .....

    ReplyDelete
    Replies
    1. vikram bhojanam sariga cheyyaleda? 5ki dosalu evaroo veyyaru, naku cheppakunda velli tinevadiva emiti 1rs/- dosalu 5ki?

      Delete
  2. Good narration.... intaki bujili and picchi mama evaru ?

    ReplyDelete