Wednesday, May 2, 2012

నా బాల్యం - వీరంగం

ఇవ్వాళ  నెట్   లో ఒక బ్లాగ్ చదువుతుంటే నా బాల్యం గుర్తులు జ్ఞప్తికి వచ్చి రాయటం మొదలెట్టా.. నా వీరంగం.

అప్పట్లో మా  పితామహులు హిందీ పండితులు (ఇప్పుడు పదవి విరమణ  చేసిన  ప్రధానోపాధ్యాయులు) గా పని చేసే రోజుల్లో నేను ఎల్ .కే.జి చేరా ప్రైమరీ పాఠశాలా లో ..  అక్కడ  ప్రధానోపధ్యలు మా మామ  కావటం తో నా ఆగడాలకు అడ్డు అదుపు ఉండేది కాదు .. 
అప్పట్లో నా బాల్య ఖర్మలు ఇలా ఉండేవి ...
1. మా ఇంటికి వచ్చే విద్యార్ధుల  పాఠ్య  పు స్తకాలు  మా దొడ్లో నీటి తొట్టిలో పడవలయ్యేవి .. తర్వాత  నా వీపు మీద  మృదంగం మోదేగి . వీరులకి ఇదొక  లెక్కా .. 
2. వీధి లో వెళ్ళే  ఆడ  పిల్లల  జడలు అలియాస్  పిలకలు పీకటం నా సరదా.. అప్పుడప్పుడు ఇంటిమీదకి గొడవకు వచ్చే వాళ్ళు, మాస్టారు వాళ్ళబ్బాయి కావటం వాల్ల   ఇంట్లో నే ఇంట్లో వాళ్ళే చెయ్యి చేసుకునే వాళ్ళు ..
3. మా వీధిలో నేనే హీరో .. ఎవడినా టైరు ఆట ఆడుతూ మా వీధి వస్తే టైరు నాకు దానం చేసి వెళ్ళాలి లేదా వాడు వాడి టైరు సైడ్ కాలవలో తేలే వాళ్ళు ...
4. అప్పట్లో నెల్లూరు వచ్చిన  కొత్తల్లో ఎల్.కే.జి రెండో సారి చదివి యు.కే.జి లో చేరా .. నా తరగతి లో గీత  అని ఒక  పోకిరి పిల్ల  నన్ను ఒరేయ్  అనటం తో నాలో మగ  పిల్లడు నిద్ర  లేచి ఆ  పిల్లని పక్కేనే ప్రవహిస్తున్న  కొంచెం  పెద్ద  మురికి   కాలవలో తోసేస .. పాపం ఆ  పిల్ల  ఒడ్డున  వున్న పచ్చ గరిక  పట్టుకొని బతికి బయట  పడింది .. నాకు ఇంట బయట  పెళ్లి చేసారు .. 
5. నేను అప్పట్లో 3 తరగతి ( అనుకుంట )... మా బంధు జనం ధూమపానం చేస్తుంటే నాకు నాలుక  పీకి ఒక  బీడీ కట్ట కొట్టేసి .. స్కూల్  బాత్రూం లో నా తోటి వెద వ  (వాడి పేరు పత్తికాయ  - లావుగా పొట్టిగా వుండే వాడు ) తో పాటు రెండు దమ్ములు లాగా .. మా స్కూల్  ఆయ  బాత్రూం లో పొగలు రావటం తో కంగారు పడి వచ్జి మమ్మల్ని చూసి వెళ్లి మా అప్రధానోపధ్యుడికి చెప్పింది .. స్కూల్  లో ప్రార్థన సమయం లో అందరి ముందు మా పరువు తీసేసాడు.. ఇంట్లో నాకు తాట  తీసేసారు ..  

ఇంకా వుంది.. 

5 comments:

  1. Nice Suresh Keepit up, We will add our Engineering stuff also ....
    Manamu mana mama ..... Totatamudu lo dinakar laa :)

    ReplyDelete
  2. Orey, emi raa idi, Sri krishna leelalu laagaa...nee pokiri cheshtalanu granthastham chestunnavaa....very funny...

    ReplyDelete
  3. Cinnapati nunche Rowdy veshalu vesevadivi annamata :)

    ReplyDelete
  4. ha ha really cool ra . Kani shake enti bey nee . sollu ga. keep it up and nee Ratnam college chestalu kuda rayee . Mana bunty gadini marachipoyav ela ? how

    ReplyDelete
  5. very nice. chala bagundi ra nee articles... inta kalaposhana vundanukola neelo.. keep it up.

    ReplyDelete