Monday, July 16, 2012

ఒంటరితనం


నా పై అనంతమైన శూన్యం, అంతులేని ఆకాశం

పొద్దు పొడిచే సూర్యుడికి ఎదురుగా నుంచున్నా
నువ్వొక్కడివే అంటూ వెక్కిరిస్తూ, నాలోని ఒంటరితనం
తిరిగి చూస్తే నేనున్నా నీకు తోడు అంటూ నా నీడ
మనసులొని వెలితిని తుడిచేస్తూ, ఎదో ఒక తృప్తి

కాలం గడిచింది, ఎదురుగా ఉన్న సూర్యుడు నడినెత్తి చేరాడు
నా నేస్తం అన్న నా నీడ నాకు కనిపించలేదు
వెతికి చూస్తే కనుమరుగయ్యే రీతిలో నా క్రింద, తలవంచి చూడమంటూ
తిరిగి మనసులో ఒంటరినేమో అని తొనికిసలాడే, ఎదో ఒక అసంతృప్తి

కాలం గడిచింది, ప్రొద్దు వాలుతూ సూర్యుడు
తిరిగి నా తోడు, మసక మసకగా అంతరిస్తూ  నా నీడ
చిలిపి నవ్వులు నవ్వుతూ, నాలోని ఒంటరితనం
అప్పుడర్ధమయ్యింది  నా నిజమైన నేస్తం ఒంటరితనం

ఇప్పుడు నాలో అనంతమైన శూన్యం, అంతులేని ఆనందం ..

7 comments:

  1. మీ కవితలో ఒంటరితనం కూడా బాగుందే:-)

    ReplyDelete
  2. భలే చెప్పారండీ ఒంటరితనాన్ని కూడా...బాగుంది!

    ReplyDelete
  3. ఒక్కోసారి ఒంటరితనం కూడా బావుంటుంది మీ కవితలా....చక్కగా వుంది మీ కవిత

    ReplyDelete
  4. చాలా బాగుంది...

    ReplyDelete